కర్నూలు: కర్నూలు జిల్లా యువజనోత్సవాలకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కు ఆహ్వానం
కర్నూలు నగర శివారులోని రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో ఈ నెల 22 న నిర్వహించే జిల్లా యువజనోత్సవాలకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ను ఆహ్వానించారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని ఎంపీ స్వగృహంలో సెట్కూరు సీఈఓ డాక్టర్.వేణు గోపాల్ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు...ఈ సందర్భంగా యువజనోత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, పోటీల గురించి సెట్కూరు సీఈఓ ఎంపీ కి వివరించారు...ఈ సందర్భంగా యువజనోత్సవాలలో యువత పెద్ద సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ నాగరాజు కోరారు...