డోన్: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు :డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 1, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణం 2వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో MLA కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు