నారాయణపేట్: విజయవంతమైన ఉచిత ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంప్
10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం 9 గంటల సమయంలో భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంపు ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్ర మోహన్, ఉప వైద్య కారిని డా.శైలజ ప్రారంభించారు. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో 229 మంది దీర్ఘకాలిక రోగగ్రస్తులకు బీపీ షుగర్ నొప్పులకు పరీక్షలు చేశారు. అనంతరం కీళ్ల నొప్పులకు మధుమేహం మూలవ్యాధి రోగులకు అజీర్ణ సమస్యలు చర్మ వ్యాధులకు ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ జయ చంద్రమోహన్ తెలిపారు.