గుంతకల్లు: గుత్తిలో పేదలకు అనువైన స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో సొంతిల్లు లేని నిరుపేదలకు నివాసానికి అనువైన స్థలాలు ఇవ్వాలని సీపీఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు రామదాసు, మహమూదా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తపేట పరిధిలో కొండపైన, నెమతాబాదు శివారులో చెరువు కట్ట కింద ఇవ్వడంతో నీరు ఉబికి వస్తూ ఇల్లు కూలి పోయే పరిస్థితి ఉందన్నారు. పేదలకు అనువైన స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.