పటాన్చెరు: ఆదివారం రాత్రి కోసిన భారీ వర్షం కారణంగా ఉధృతంగా మత్తడి దుంకుతున్న చెక్ డ్యాం
జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నారం–జంగంపేట ప్రధాన రహదారి పక్కన ఉన్న చెక్డాం మత్తడి ఉధృతంగా దూకుతోంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా చెక్ డ్యామ్ నిండిపోవడంతో నీరు మత్తడి నుంచి ఎగసిపడుతోంది. ఈ దృశ్యాన్ని చూసి స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, రాబోయే రబీ సీజన్ పంటలకు ఇది మేలు చేస్తుందని సోమవారం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.