రాయచోటి: వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి
రాయచోటి పట్టణంలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు రహదారులపై ప్రజలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా రామాపురం, చౌడేశ్వరి దేవి గుడి పరిసరాల్లో పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతుండటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.ఎన్జీఓ కాలనీ, రామాపురం వైపు బైకుపై వెళ్లడానికి, నడిచిపోవడానికి ప్రజలు భయపడుతున్నారు. చిన్నారులు స్కూళ్లకు వెళ్తూ వస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గతంలో పలుచోట్ల కుక్కలు పిల్లలపై దాడి చేసిన సంఘటనలు చోటుచేసుకోవడంతో మరింత భయాందోళన పెరిగింది.