ఒంగోలు అర్బన్: ఏడుగుండ్లపాడు గ్రామంలో ఉద్రిక్తత, చెరువు వద్ద స్మశాన వాటిక ఏర్పాటు చేయొద్దని నిరసనకు దిగిన గ్రామస్తులు
Ongole Urban, Prakasam | Jun 24, 2026
ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామంలో బుధవారం ఉద్ధరిక్తత చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు వద్ద 220/1 సర్వే నంబర్లు స్మశాన వాటిక ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్ధరిక్తత చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయడం వల్ల చెరువు నీరు కలుషితమై ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవటం లేదని అదేమిటంటే స్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్న వారిది సొంత స్థలమని చెబుతున్నట్లుగా స్థానికులు తెలిపారు.