నారాయణపేట్: గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నవరాత్రి ఉత్సవాల కరపత్రం విడుదల
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆదివారం 11 గంటల సమయంలో రేపటి నుండి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కరపత్రం విడుదల చేశారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ నాయుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామచంద్రయ్య, నీరటి నారాయణ, నీరటి బాబు, మనిగిరి శ్రీనివాసులు, టప్ప కృష్ణ, హుస్సేనయ్య, చంద్రయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.