ఎల్లారెడ్డిపేట: వింత కోడి..సోషల్ మీడియాలో వీడియోలు,ఫోటోలు వైరల్
వింత కోడిని మీరు ఎప్పుడైనా చూశారా..? ఆదివారం.సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తుమ్మనపల్లి రాజేష్ గాంధీ పౌల్ట్రీ ఫార్మ్ నడిపిస్తున్నాడు. శనివారం ఐదువేల కోళ్లను తన ఫామ్ లోకి తీసుకువచ్చాడు. అందులో ఒక కోడి మూడు కాళ్లతో ప్రత్యక్షమైంది. సాధారణంగా కోడికి 2 కాళ్లు ఉంటాయి. కానీ,ఈ కోడి వెనుక భాగంలో అదనంగా ఇంకో కాలుతో జన్మించింది. వెనుక భాగంలో ఉన్న కాలుకు 7 వేళ్లు వచ్చాయని రాజేష్ గాంధీ ఆదివారం తెలిపారు.వింత కోడిని జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు.