శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన పెల్లూరు జ్వాలాముఖి అమ్మవారు
Ongole Urban, Prakasam | Jul 10, 2025
పెళ్లూరు గ్రామంలో గల ప్రసిద్ధ శ్రీ గురునాధేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠమందు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం అమ్మవారిని శాకాంబరిగా తీర్చిదిద్ధి భక్తులకు దర్శనభాగ్యాన్ని కలిగించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో దేవస్థాన ఆవరణతో పాటుగా అంతరాలయాన్ని, గర్భాలయాన్ని జ్వాలాముఖి దేవి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని వివిధ రకాల కూరగాయలతో పాటుగా పలురకాల పండ్లతో అలంకరించి శాకాంబరిగా కొలువు తీర్చారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి కుంకుమార్చనను చక్కగా జరపించారు. మహిళలు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించారు.