ఒంగోలు అర్బన్: ఒంగోలులో వచ్చేనెల 6వ తేదీ నుంచి ఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమం: రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి
Ongole Urban, Prakasam | Jun 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 6వ తేదీ నుంచి మహిళలకు 31 రోజుల పాటు మగ్గం వర్క్స్ ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని సంస్థ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి బుధవారం తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళలు అర్హులని, 19 ఏళ్ల నుంచి 50 మధ్యలో ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ తెలిపారు.