పలమనేరు: గంగవరం: మదర్ తెరిసా కాలేజ్ ఎదురుగా చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, తప్పిన పెను ప్రమాదం భయాందోళనకు గురైన ప్రయాణికులు
గంగవరం: మండల స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులను మదనపల్లె వైపు తరలిస్తూ మదర్ తెరిసా కాలేజ్ వద్ద చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జయింది అద్దాలు పగిలిపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కాకపోతే ఎవరికి ప్రాణాపాయం లేదని సమాచారం. కాగా ఇదే ప్రాంతంలో గతంలో ఓ ఎమ్మార్వో కారును స్పీడుగా పోనిచ్చి అక్కడ పక్కన ఉన్నటువంటి తోపుడుబళ్లను ఢీకొని ఇద్దరి మరణానికి కారణమయ్యారు. అదే ప్రాంతంలో కొద్దిగా ముందు బస్సు వెళ్లి ఉంటే ప్రాణాపాయం ఎక్కువగా జరిగేదని స్థానికులు చర్చించుకున్నారు.