ఉరవకొండ: నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొన్న లారీ -డ్రైవర్ మృతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని భూధివర్తి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టును లారీ డీ కొన్న ప్రమాదంలో డ్రైవర్ బోయ శంకర్ (30) మృతి చెందాడని బెలుగుప్ప ఎస్సై శివ మంగళవారం ఉదయం పేర్కొన్నారు. భూధివర్తి గ్రామానికి చెందిన శంకర్ డ్రైవర్ వృత్తిని నిర్వహిస్తూ ఉండేవాడని ఇందులో భాగంగానే లారీని గ్రామానికి తీసుకువచ్చి తిరిగి వెళుతుండగా వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదం చోటుచేసుకుందన్నారు. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.