డోన్: బేతంచర్ల లో ప్రశాంతంగా ముగిసిన బక్రీద్ ప్రార్థనలు
Dhone, Nandyal | May 28, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలోని ఈద్గాలో ప్రతీ సంవత్సరం జరిగే విధంగానే బక్రీద్ ప్రార్థనలు గురువారం జరిగాయి.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా DSP శ్రీనివాస్, CI వెంకటేశ్వరరావు, SI రమేశ్ బాబు సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలను DSP ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆప్యాయత, సహాయ గుణం కలిగి ముందుకు సాగాలని కోరారు