ఉరవకొండ: లత్తవరంలోని శ్రీ ఉమామహేశ్వర ఆశ్రమం వద్ద సందడిగా కార్తీక వన భోజనాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామం వద్ద శ్రీ ఉమామహేశ్వర ఆశ్రమానికి ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వన భోజన కార్యక్రమాలను నిర్వహించారు. కార్తీక మాసం మూడవ ఆదివారం కావడంతో ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు తరలివచ్చి ఉమామహేశ్వర స్వామికి పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం ఉసిరి చెట్లకు పూజలు నిర్వహించి భోజన కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.