ముమ్మిడివరం మండల పరిధి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు సన్మానం.
ముమ్మిడివరం మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారిని కమల కుమారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల పరిధిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను, తల్లిదండ్రులను, ప్రధానోపాధ్యాయులను మండల విద్యాశాఖ తరఫున సత్కరించారు. వీరు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బొజ్జా రమణశ్రీ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.