ఆళ్లగడ్డ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు, సోమవారం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఆకు పూజ నిర్వహించారు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, సాయంత్రం స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు, దీంతో ఆళ్లగడ్డ పట్టణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది