మర్రిగూడ: మండలంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యాన్ని పరిశీలించిన ఎన్ఫోర్స్మెంట్ రఘునందన్
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని రైస్ మిల్లులను ఎన్ఫోర్స్మెంట్ డిటి రఘునందన్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైస్ మిల్లర్లు ప్రజా పంపిణీ బియ్యం లబ్ధిదారుల నుండి కొని రీసైక్లింగ్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. సకాలంలో సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు సకాలంలో చెల్లించాలని ఆదేశించారు.