నంద్యాల జిల్లాలో తగ్గిన మట్టి కుండల వినియోగం
Dhone, Nandyal | May 11, 2026 ఎండాకాలం కావడంతో నంద్యాల జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో మట్టితో తయారుచేసిన కుండలో నీరు చల్లగా ఉండటంతో అధికంగా వీటిని ఉపయోగిస్తారు. దీనిని పేదవాడి ఫ్రిడ్జ్ గా పోలుస్తారు. మంచినీటి కుండలు వాటి సైజును బట్టి రూ.150 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. అయితే మారుతున్న కాలాన్ని బట్టి ఫ్రిడ్జుల వినియోగం పెరగడంతో మట్టి కుండల వాడకం తగ్గిందని వ్యాపారులు తెలిపారు.