కనిగిరి: వేసవిలో పిల్లలు చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: పామూరు సిఐ భీమా నాయక్
పామూరు: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పామూరు సీఐ భీమా నాయక్ సూచించారు. శుక్రవారం పామూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల కురిసిన వర్షాలకు పామూరు సర్కిల్ పరిధిలోని చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరిందన్నారు. సెలవుల్లో పిల్లలు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులు మరియు కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉందని, ఈత కోసం నీటిలో దిగితే ప్రమాదాలకు గురవుతారన్నారు. పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు వారి పట్ల నిఘా ఉంచి, చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు.