నంద్యాల అర్బన్: కొత్తపల్లి అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో ఆప్యాయంగా గడిపిన నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jun 20, 2026
నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందర్శించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చిన ఎంపీకి చిన్నారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంగన్వాడి సెంటర్లో చిన్నారులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కలిసిపోయి ఆప్యాయంగా గడిపారు. చిన్నారుల కోసం వంట వండి దగ్గరుండి వాళ్లకు తినిపించి ఆమె భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట టిడిపి శ్రేణులు అధికారులు ఉన్నారు