పారిశుద్ధ పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు : నగర కమిషనర్ జస్వంత్ రావు
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ జస్వంత్ రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన నగరంలో పింక్ టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి స్థలాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్యం అలసత్వం ప్రదర్శిస్తున్న పరిస్థితులను గమనించి సంబంధిత అధికారులను ఆయన హెచ్చరించారు.