జగన్ పర్యటిస్తుంటే టిడిపి నాయకుల గుండెల్లో వణుకు పుడుతుంది - వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jul 9, 2025
జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తుంటే టిడిపి నాయకుల గుండెల్లో వణుకు పుడుతుందని అందుకే పర్యటనలను అడ్డుకుంటున్నారని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజల్లోనికి తీసుకొని వెళ్లి మరల వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చే దిశగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.