నందికోట్కూరు: ఓటర్ మ్యాపింగ్ లో బి ఎల్ వో లుని ర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు:
ఆర్డీవో వెంకట శివ
ఓటర్ల మ్యాపింగ్ పై బిఎల్వోలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు డివిజనల్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు ఆర్డీవో సి.వెంకట శివ బిఎల్ఓ లనుహెచ్చరించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో మంగళవారం జరిగిన బిఎల్ఓ (బూత్ లెవెల్ అధికారి)లతో ఆర్డీవో సమీక్ష నిర్వహించారు. మిడుతూరు మండలంలో ఓటర్ మ్యాపింగ్ 90 శాతం చేయాల్సి ఉండగా 60.54 శాతం మాత్రమే చేశారు.వీటిలో మండలం చాలా వెనుకబడి ఉంది. మీరేం చేస్తున్నారు విధుల పట్ల అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ అదేవిధంగా గ్రామాల వారీగా ఓటర్ మ్యాపింగ్ ఎంత పర్సంటేజ్ చేశారని వారిపై ఆర్డిఓ మండిపడ్డారు.