ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిపై నిఘా పెట్టామని తెలిపిన పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 30, 2026
బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిస్తున్నారు. గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య కార్మికులతో ప్రాంతాలను పోలీసులు శుభ్రం చేయించారు. నిరంతరం ఇకమీదట ఈ ప్రాంతాలపై నిఘా ఉంటుందని బహిరంగంగా మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.