డోన్: ఐఐటి మద్రాస్ లో సీటు సాధించిన డోన్ విద్యార్థి,అభినందించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 16, 2026 డోన్లో చదివిన తెలికి మధులత జేఈఈ అడ్వాన్స్లో 334 ఆలిండియా ర్యాంకుతో పాటు ఐఐటీ మద్రాసులో సీటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన విద్యార్థిని MLA కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఆమె సాధించిన విజయం డోన్ ప్రాంతానికి గర్వకారణమని, గ్రామీణ, చిన్న పట్టణాల విద్యార్థులు కూడా కష్టపడి చదివితే జాతీయ స్థాయిలో ప్రతిభ చాటగలరని ఎమ్మెల్యే తెలిపారు.