వెలిగండ్ల : ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలిగండ్ల బీసీ కాలనీలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వెలిగండ్ల బీసీ కాలనీకి చెందిన యువకుడు గత మూడు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు. అయితే బీసీ కాలనీ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయక వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు ఎస్ఐ తరలించారు.