నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
Nandyal Urban, Nandyal | May 28, 2026
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా జరిగాయి. జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, జిల్లా పర్యాటక అధికారి విజయలక్ష్మి తదితర అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అధికారులు కొనియాడారు.