ఒంగోలు అర్బన్: బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు
Ongole Urban, Prakasam | Jun 10, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో బుధవారం సినీ హీరో శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను బాలకృష్ణ జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదటగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం డిజార్ ట్రస్ట్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను వీధి వ్యాపారులకు తోపుడుబండ్లను పంపిణీ చేశారు అనంతరం వృద్ధులకు పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సినీ హీరోగా శాసనసభ్యుడు గానే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ఎందరో పేదలకు ఉచిత వైద్య సేవ అందజేస్తున్న బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు