నంద్యాల అర్బన్: చిత్తూరు జిల్లా విలేఖరి హత్యకు నంద్యాలలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన, ఎస్పీకి వినతి
Nandyal Urban, Nandyal | Apr 29, 2026
చిత్తూరు జిల్లాలోని విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ నంద్యాల జిల్లా APUWJ నేతలు జిల్లా ఎస్పీ సునీల్ షేరను వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాంసుందర్, జిల్లా అధ్యక్షుడు మధుబాబు నేతృత్వంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేఖరుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చలం బాబు, ఉస్మాన్ భాష నుంచి పలువురు నేతలు పాల్గొన్నారు.