చీమకుర్తి లోని మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ సుకన్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మద్యం షాపుల్లో మద్యం బాటిల్స్ ను విక్రయించేటప్పుడు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి, మద్యం బాటిల్స్ విక్రయించాలని మద్యం షాపుల నిర్వాహకులకు సూచించారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాతనే విక్రయాలు జరపడం ద్వారా నకిలీ మద్యానికి అడ్డుకట్ట వేయవచ్చని ఆమె తెలిపారు. ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయించాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లోనే మద్యం షాపుల్లో విక్రయాలు జరపాలని షాపుల నిర్వాహకులకు సూచించారు.