ఒంగోలు అర్బన్: బీసీ హాస్టల్ విద్యార్థులకు రూములను కేటాయించాలంటూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
Ongole Urban, Prakasam | Jul 3, 2026
బీసీ హాస్టల్ విద్యార్థులకు రూములను కేటాయించాలని ఎస్ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ హాస్టల్ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ధర్నాలో పాల్గొన్నారు డివైఎఫ్ఐ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ పివిఆర్ హైస్కూల్లో మిగిలిన రూములను మ్యూజియం కాకుండా బీసీ హాస్టల్ విద్యార్థులకు కేటాయించాలన్నారు వినోద్ మాట్లాడుతూ బీసీ హాస్టల్ విద్యార్థుల ఫ్రీ పోస్ట్ మెట్రిక్ లెసన్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హై స్కూల్లో రూములను బిసి హాస్టల్ విద్యార్థులకు కేటాయించాలన్నారు