జహీరాబాద్: రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుఖేష్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుఖేష్ రెడ్డిని మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆస్పత్రిలో పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం బీజేపీ నాయకులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్న బిబి పాటిల్ వైద్యులతో మాట్లాడి సుఖేష్ రెడ్డి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోరుకునేలా చూడాలని సూచించారు. మాజీ ఎంపీ తోపాటు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, అరుణ్ తదితరులు ఉన్నారు.