గాంధారి: విద్యుత్ఘతంతో పొలం వద్ద కౌలు రైతు మృతి : ఎస్సై ఆంజనేయులు
గాంధారి మండలం ముదేల్లి గ్రామానికి చెందిన కర్రోల్ల సాయిలు ( 57 ) అనే కౌలు రైతు సోమవారం విద్యుత్ఘతంతో మృతి చెందినట్లు పోలీసులు సోమవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తి కాగుల మొగులయ్య అనే రైతు పొలంను కౌలుకు తీసుకొని దాంట్లో వరి పంట వేసాడు. అట్టి పొలంలో కలుపుతీయటానికి తన భార్య అయిన లలితతో సహా వెళ్లి, మధ్యాహ్నం సాయిలు భార్య లలిత ఇంటికి సద్ది కోసం వెళ్లగా, ఆ సమయంలో కర్రోల సాయిలు తాను కవులు చేస్తున్న వరి పొలం కు నీరు పెట్టడానికై స్టార్టర్ దగ్గరికి వెళ్ళగా స్టార్టర్ వద్ద వైరు తేలి ఉండడంతో, చేతివేళ్ళకు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు.