డోన్: డోన్ లో విషాదం, విద్యుత్ ఘాతంతో సెలూన్ షాపులో పనిచేసే వ్యక్తి మృతి
Dhone, Nandyal | Apr 29, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పట్టణంలో చీఫ్ అండ్ బెస్ట్ సెలూన్ షాపులో విద్యుత్ ఘాతానికి గురై అనీష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే కోలుకోలేక బుధవారం మృతి చెందాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు