ఒంగోలు అర్బన్: ఒంగోలులో కులవివక్ష పై దళిత నేత నీలం నాగేంద్రం తీవ్ర ఆగ్రహం, అపార్ట్మెంట్లో ఉండనివ్వకుండా చేసిన వారిపై కేసు నమోదుకు పట్టు
Ongole Urban, Prakasam | May 28, 2026
ఒంగోలులో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉండేందుకు దళిత వ్యక్తిని ఓ సామాజిక వర్గం అడ్డుకుంటుందని నీలం నాగేంద్రం ఆరోపించారు. 49 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొంటే అందులో కులం తక్కువ వాడిని అక్కడి వారు ఉండనివ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని నాగేంద్రం ఉన్నారు. కులవివక్ష చూపించిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఎంక్వయిరీకి వెళ్లిన సిఐలు ఎస్సైలు పై కూడా అక్కడివారు రెచ్చిపోయి మాట్లాడారని నాగేంద్రం ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ కేసులను నీరు కారుస్తుందని అన్నారు.