బనగానపల్లె: కోవెలకుంట ప్రభుత్వ ఆసుపత్రికి వీల్ చైర్ల విరాళం
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బిజినవేముల గ్రామానికి చెందిన ఏఎస్ఐ బత్తుల ఓబులేసు ఆయన పోలీస్ సోదరులు రూ.20 వేల విలువైన 3 వీల్చైర్లు విరాళంగా అందజేశారు. పేదలకు సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తూ భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.