పలమనేరు: బైరెడ్డిపల్లి: మైనర్ బాలికను పెళ్లి చేసుకొని నరకం చూపించిన శాడిస్ట్ భర్త, పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబం
బైరెడ్డిపల్లి: మండలం కోట్రేపల్లికి చెందిన ప్రకాష్ మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. తన కుమార్తె శిరీషను మిట్టపల్లికి చెందిన సంపంగి కుమారుడు శివాజీ నాలుగు నెలల ముందు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు శివాజీ తనను వేధిస్తున్నాడని తన కుటుంబంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. శిరీష మాట్లాడుతూ తన భర్త ప్రతిరోజు తనను కొడుతూ రక్త గాయాలు చేస్తూ,శారీరకంగా మానసికంగా, హింసిస్తున్నాడని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, కట్నం తేవాలని వేధిస్తున్నాడని తనకు ఇంటర్లో 1000/900 మార్కులు వచ్చాయని నా జీవితం తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు.