శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లిలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
చాలామంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతున్నారు... సోషల్ మీడియాలో కానీ... లెటర్లు కానీ.. తెలుగు పదాలను కూడా ఇంగ్లీషులో రాస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇంట్లో కూడా మనం మాట్లాడే భాషలో 30 శాతం మాత్రమే తెలుగులో మాట్లాడుతున్నాం. మిగిలినదంతా ఇంగ్లిష్లోనే మాట్లాడుతున్నాం. ఒకప్పుడు అందరూ అన్ని వస్తువులను తెలుగులోనే మాట్లాడే వారు. కానీ మనమే ఇలా ఇంగ్లిష్లో మాట్లాడి తెలుగును నిర్వీర్యం చేస్తున్నాం. అందుకే ఇప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకుందాం.’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు