నారాయణపేట్: మంతన్గౌడ్, సామాన్ పల్లి గ్రామాల్లో వంట గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్ మండలంలోని మంతన్ గౌడ్,సామాన్పల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పలువురు లబ్ధిదారులకు వంటగ్యాస్ సిలిండర్ ప్రోసిడింగ్ పత్రాలను అందించారు. ఎన్నికలు ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా 500 కే వంట గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు.