కామారెడ్డి: కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం 82 ఫిర్యాదులు క్షుణ్ణంగా పరిశీలించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం ఒంటిగంట వరకు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వినతులను జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ చందర్ నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.