ఆళ్లగడ్డ: తువ్వ పల్లె గ్రామంలో భార్య హత్య కేసులో, భర్త కుమారుడు అరెస్ట్, ఎస్సై జయప్ప
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం తువ్వ పల్లె గ్రామంలో గత డిసెంబర్ లో జరిగిన శెట్టి వరాలు మృతి కేసు హత్యగా తేలింది, కుటుంబ కలహాల కారణంగా భర్త చంద్రుడు, కుమారుడు వెంకటరమణ ఆమెను గొంతు నులిమి చంపినట్లు రుద్రవరం ఎస్ఐ జయప్ప తెలిపారు, నిందితులు శుక్రవారం వీఆర్వో వద్ద లొంగిపోగా వారిని అరెస్టు చేసి సీఎం ముందు హాజరపరిచామన్నారు, అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై జయప్ప తెలిపారు, ఈ కార్యక్రమంలో సిఐ రాము ఎస్సై జయప్ప పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు