పటాన్చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఘనంగా ప్రజా పరిపాలన దినోత్సవం నిర్వహించారు. సీఐ నయీముద్దీన్, ఎస్సై హనుమంత్ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ జాతీయ జెండాను ఆవిష్కరించగా, అనంతరం హాజరైన అధికారులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.