జిల్లా ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు,సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరుస్తానని వెల్లడి
Ongole Urban, Prakasam | Sep 14, 2025
ప్రకాశం జిల్లా ఏ.ఆర్ విభాగం అడిషనల్ ఎస్పీగా కే.శ్రీనివాసరావు యాదవ్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.కడప జిల్లాలో ఏ.ఆర్ డీఎస్పీగా పని చేస్తూ ఆయన పదోన్నతి పై ఒంగోలుకు బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఏ.ఆర్ అధికారులు,సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు.జిల్లాలో ఏ.ఆర్ విభాగాన్ని బలోపేతం చేస్తానని, సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరుస్తానని శ్రీనివాసరావు చెప్పారు.