ఉరవకొండ: విడపనకల్లు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్యాధికారులు
అనంతపురం జిల్లా విడపనకల్లు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం పుష్ప అధ్యక్షతన సీజనల్ వ్యాధుల పైన సోమవారం అవగాహన సమావేశము నిర్వహించి వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రతతో పాటు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే జరపీడుతులకు రక్త పరీక్షలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ కి పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి హెల్త్ సూపర్వైజర్లు కంబయ్య అమృతలత హెల్త్ అసిస్టెంట్ నూరు మొహమ్మద్ ల్యాబ్ టెక్నీషియన్ నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు