నంద్యాల అర్బన్: నంద్యాల ఏకశిలా అభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలు
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురంలోని ఏకశిలా అభయాంజనేయ స్వామికి మంగళవారం నిజ జ్యేష్ట మాస అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి ఆకు పూజలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి, రవితేజ తెలిపారు. అర్ధరాత్రి 2 గంటలకు మహా మంగళహారతి జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు భారీగా ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు