గంజాయి నిర్మూలన కోసం ఎస్పీ ఆదేశాలతో ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ.
Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం సాయంకాలం ఒంగోలులోని పివిఆర్ గ్రౌండ్ లో గంజాయి వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ సీఐ భీమా నాయక్ పర్యవేక్షణలో, *ఏఎస్ఐ మహబూబ్ బాషా ఈగల్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి అక్కడికి చేరుకున్న యువకులకు, క్రీడాకారులకు మరియు ప్రజలకు గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.