నిజామాబాద్ సౌత్: కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి: వనమాల కృష్ణ, CPI(ML) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి
మహాత్మ జ్యోతిభాపూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా CPI(ML) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "కుల నిర్మూలన సదస్సు"ను కోటగల్లీలోని జిల్లా పద్మశాలి భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిభాపూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగాను, దాని నిర్మలనా లక్ష్యంగాను 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ ను ఏర్పరిచారన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన చైతన్య సదస్సులు, సమావేశాలు జరుపుతున్నామన్నారు.