అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆదేశాల మేరకు, మెంథా తుఫాను పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పట్టణ పురవీధులలో ఆటోలలో ప్రచారం నిర్వహించారు.ప 26 నుండి 30వ తేదీ వరకు లోతట్టు ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని. వరదలు వంటి సమస్యలు ఎదురైతే మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందాలని మునిసిపల్ కమిషనర్ ప్రమీల కోరారు.