మంగళగిరి: మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను అకస్మిక తనిఖీలు చేశారు. పోలీస్ అధికారులు ,సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు. మంగళగిరి ప్రాంతంలో గంజాయి, ట్రాఫిక్ సమస్యలను గుర్తించామని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని ప్రజలకు సూచించారు.